భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త
- June 04, 2021
అమెరికా: అమెరికాలో నివసించే భారతీయ టెక్ నిపుణులకు శుభవార్త. గ్రీన్‌కార్డుల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్న వారి కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. ప్రస్తుతం గ్రీన్‌కార్డుల జారీలో ఉన్న దేశాల వారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు యూఎస్ కాంగ్రెస్‌లో ఎక్కువ మంది సభ్యుల ఆమోదం లభించింది. జో లోఫ్గ్రెన్, జాన్ కర్టిస్ అనే ఇద్దరు సభ్యులు ‘ది ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (EAGLE) చట్టం–2021’ను సభలో ప్రవేశట్టగా.. ఈ బిల్లుకు అనుకూలంగా 365 మంది, వ్యతిరేకంగా 65 మంది ఓటేశారు. ఇక సెనెట్ ఆమోదం కూడా పొందితే అధ్యక్షుడు జో బైడెన్ సంతకంతో ఈ ప్రతిపాదన చట్ట రూపం దాల్చనుంది. ప్రస్తుత వలస విధానంలో భారత్‌కు కేటాయించిన 7 శాతం కోటా.. హెచ్ 1బీ వర్కింగ్ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న నిపుణులు గ్రీన్‌కార్డు పొందడంలో అడ్డంకిగా మారింది. అందువల్ల, తాజా బిల్లుకు ఆమోదం లభిస్తే ప్రస్తుతం ఉన్న 7 శాతం ఉన్న కోటా 15 శాతానికి పెరగనుంది. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే ఇతర దేశాల కన్నా భారతీయులకే ఎక్కువ లబ్ధి చేకూరనుంది. ఎందుకంటే అమెరికాలో ఎక్కువ మంది ఐటీ నిపుణులు భారత్‌కు చెందిన వారే ఉంటారు. అయితే, 7 శాతం దేశీయ కోటాతో నైపుణ్యం ఉన్నా సరే ఎక్కువ మంది గ్రీన్ కార్డు పొందలేకపోతున్నారు.
ఈ కోటాను 15 శాతానికి పెంచితే ఎక్కువ మందికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఇమిగ్రేషన్, సిటిజన్ షిప్‌పై ఏర్పాటైన కాంగ్రెస్ ఉప కమిటీ చైర్మన్ లోఫ్గ్రెన్ మాట్లాడుతూ.. ‘వలసదారులకు వీసాలను కేటాయించే ప్రాథమిక చట్టం 20 వ శతాబ్దం మధ్యకాలం నాటిది. ఈ చట్టంలో చివరిగా 1990లో మార్పులు చేశారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డుల జారీలో మార్పులు చేయాల్నిన అవసరం ఉంది. తాజా నిబంధనలు అమలైతే, నైపుణ్యాల ఆధారంగా గ్రీన్‌కార్డులు అందుతాయి. అమెరికా కంపెనీలు అత్యున్నత స్థాయి నిపుణులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు.
ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా గల భారతదేశం ప్రస్తుత వలస విధానంతో నష్టపోతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడే, ఉద్యోగాలు సృష్టించగల భారతీయ వృత్తి నిపుణులు ఈ కోటా పరిమితి కారణంగా నష్టపోతున్నారు. మరోవైపు తక్కువ జనాభా గల ఇతర దేశాల వారికి నైపుణ్యాలు అంతగా లేకున్నా కోటా ఆధారంగా గ్రీన్ కార్డులు మంజూరవుతున్నాయి. కాబట్టి, అధిక జనాభా ఉన్న దేశాలకు, తక్కువ జనాభా ఉన్న దేశాలకు ఒకే విధంగా గ్రీన్‌కార్డులు ఇస్తే సమానత్వం లోపిస్తుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని లోఫ్గ్రెన్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ బిల్లు గట్టెక్కితే హెచ్1బి వీసాపై అమెరికాలో నివసిస్తున్న దాదాపు 10 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు మేలు జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష