తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు
- June 05, 2021
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో వారం పొడిగించింది. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు నియంత్రణలోకి వచ్చినా.. మరింత కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ను జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్టు స్టాలిన్ సర్కార్ ప్రకటించింది. కరోనా కట్టడిపై అధికారులతో సమీక్ష చేసిన మరుసటి రోజే లాక్ డౌన్ ను పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది.
లాక్ డౌన్ పొడిగింపుతో పాటు కొన్ని సడలింపులను ఇచ్చింది. చెన్నైకి మరిన్ని సడలింపులను ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే అనుమతించిన కార్యకలాపాలకు అన్ని జిల్లాల్లోనూ అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
11 జిల్లాల్లో కరోనా కేసులు ఇంకా ఎక్కువగానే వస్తున్నా.. ప్రజల అవసరాల దృష్ట్యా ఆయా జిల్లాల్లోనూ సడలింపులను ప్రకటించింది. అందులో భాగంగా కిరాణా దుకాణాలు, కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతించారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో నడిపేందుకు అనుమతించారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులకూ ఓకే చెప్పినా.. ఒక రోజులో కేవలం 50 టోకెన్లకే పరిమితం చేశారు. చెన్నై వంటి సిటీల్లో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, హౌస్ కీపింగ్ ఏజెన్సీలకూ ఈ–రిజిస్ట్రేషన్ ద్వారా సేవలందించేందుకు అనుమతులిచ్చింది. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మోటార్ టెక్నీషియన్లు, కార్పెంటర్లూ పనులు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. వాహన మెకానిక్ లకూ ఓకే చెప్పింది.
కాగా, కేసులు ఎక్కువగా ఉన్న నీలగిరులు, కొడైకెనాల్, ఎర్కాడ్, ఎళగిరి, కోర్తాలాలకు వెళ్లాలంటే జిల్లా కలెక్టర్ల నుంచి ఈ–పాస్ లను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







