ట్విటర్‌కు చివరి హెచ్చరిక జారీ చేసిన భారత్
- June 05, 2021
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్‌కు చివరిసారి, కఠినమైన హెచ్చరికను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, లేదంటే చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందేనని ఐటీ మంత్రిత్వ శాఖ ప్యానెల్ స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐటీకి చెందిన సీనియర్ అధికారులతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
కొత్త మధ్యవర్తిత్వ మార్గదర్శక నిబంధనలు గత నెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకుముందు వీటిని అంగీకరించడానికి సోషల్ మీడియా సంస్థలకు ప్రభుత్వం మూడు నెలల సమయం ఇచ్చింది. అయితే ట్విటర్ మాత్రం వీటికి ఇంకా అంగీకరించలేదు. ఇండియాలో చీఫ్ కాంప్లయెన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్ గ్రీవియెన్స్ ఆఫీసర్లను ట్విటర్ ఇంకా నియమించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







