జీవన విధానాలను మార్చుకుందాం: ఉపరాష్ట్రపతి
- June 05, 2021
న్యూఢిల్లీ: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.ఈ సందర్బంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోషల్ మీడియా ద్వారా సందేశం అందించారు.క్షీణ దశకు చేరుకుంటున్న మన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించేందుకు చేపడుతున్న రక్షణ చర్యలను మరింత తీవ్రతరం చేద్దామని పిలుపునిచ్చారు.మన సాగు భూముల్లో సుస్థిర వ్యవసాయ విధానాలకు మారడం ద్వారా మన అడవులను పునర్నిర్మించుకుందాం, మన సముద్రాల కాలుష్యాన్ని నివారిద్దాం అని సూచించారు.
'మనం పర్యావరణానికి హాని చేయని జీవన విధానాలను అలవర్చుకుందాం. విద్యుచ్ఛక్తి వినియోగంపై స్పృహతో వ్యవహరిద్దాం. విడుదల చేసే కర్బన ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి తగ్గిద్దాం. మన పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆవాసయోగ్యమైన భూమండలాన్ని అందిద్దాం' అని వెంకయ్యనాయుడు తన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!