రియల్ ఎస్టేట్ ప్రకటనలు కేవలం సౌదీ పౌరులకు మాత్రమే

- June 05, 2021 , by Maagulf
రియల్ ఎస్టేట్ ప్రకటనలు కేవలం సౌదీ పౌరులకు మాత్రమే

సౌదీ అరేబియా: కొత్త రియల్ ఎస్టేట్స్ ప్రకటనల నియంత్రణ విధానం ప్రకారం, కేవలం సౌదీలు మాత్రమే రియల్ ఎస్టేట్ ప్రకటనలు ఇవ్వడానికి అర్హులని జనరల్ రియల్ ఎస్టేట్ అథారిటీ పేర్కొంది. ఫేక్ రియల్ ఎస్టేట్ ప్రకటనల్ని నియంత్రించడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ప్రకటనల నిమిత్తం నేషనల్ సింగిల్ సైన్ ఆన్ వేదిక అయిన నఫాజ్ వద్ద రిజిస్ట్రేషన్ చేయాల్సి వుంటుంది. ప్రాపర్టీ ఓనర్ తానేనని ఈ వేదికపై ఆధారాలు చూపించాలి. లీగల్ ఏజెంట్ లేదా రియల్ ఎస్టేట్ బ్రోకర్ రాతపూర్వక అథరైజేషన్ లేదా కోర్టు ఆర్డర్ సమర్పించాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ రియల్ ఎస్టేట్ వేదికలకు సంబంధించి లైసెన్సింగ్ మరియు క్లాసిఫికేషన్ సంబంధిత రిక్వైర్‌మెంట్స్ రియల్ ఎస్టేట్ జనరల్ అథారిటీ ద్వారా జారీ చేయబడ్డాయి. ఉల్లంఘనులపై చట్టపరమైన చర్యలు తప్పవు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com