షో కోసం కసరత్తులు మొదలెట్టేసిన బిగ్ బాస్ టీం
- June 05, 2021
చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయిన రియాలిటీ షో బిగ్ బాస్. అసలు ఇది మన దగ్గర వర్కవుట్ అవుతుందా లేదా అనే అనుమానాల నుంచి సూపర్ హిట్ అయ్యేవరకు వచ్చింది పరిస్థితి. నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. సీజన్ 5 కోసం రెడీ అవుతుంది. ఈ మాయదారి కరోనా వైరస్ కారణంగా ఏది ప్లాన్ ప్రకారం సాగడం లేదు. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్లుంది పరిస్థితి ఇప్పుడు. సినిమాలు అలాగే ఉన్నాయి. టీవీ షోల పరిస్థితి కూడా అలాగే ఉంది. మరీ ముఖ్యంగా వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి మొదలుపెట్టిన ఐపీఎల్ కూడా అర్థంతరంగా మధ్యలోనే ఆగిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వైరస్ అటాక్ చేస్తూనే ఉంది.
ఇదే సమయంలో నాగార్జున హోస్ట్ చేస్తున్న సక్సెస్ ఫుల్ షో బిగ్ బాస్ 5 గురించి ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. 5వ సీజన్ కోసం వేచి చూస్తుంది. మొదటి మూడు సీజన్స్ ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి అయిపోయాయి. కానీ నాలుగో సీజన్ మాత్రం కరోనా కాలంలో వచ్చింది. అందులో ఎంపిక చేసిన కంటెంస్టెంట్స్ ఒక్కొక్కరిని రెండు వారాల పాటు క్వారంటైన్ చేసిన తర్వాత కానీ ఇంట్లోకి పంపించలేదు. ఈ సారి కూడా వైరస్ అలాగే ఉండడంతో ఐదో సీజన్ కూడా అలాగే చేయబోతున్నట్లు తెలుస్తుంది. నాలుగో సీజన్ మాదిరే కంటెస్టెంట్స్ అందర్నీ జూమ్ యాప్ లోనే ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
వాళ్లను అక్కడే ఫైనల్ చేసి.. కరోనా టెస్ట్ చేసి రెండు వారాలు క్వారంటైన్ తర్వాత ఇంటి లోపలిపి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతేడాది ఎలా అయితే చేసారో ఇప్పుడు కూడా ఇలాగే చేయబోతున్నారు. ఎందుకంటే బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నారు. కరోనా ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుండటంతో జులైలో కొత్త సీజన్ మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 5వ సీజన్ ను ఎట్టి పరిస్థితుల్లోనే లేట్ కానీకుండా చూస్తున్నారు. జులైలో మొదలు పెడితే కానీ నవంబర్ లో పూర్తి కాదు. దాంతో లేట్ చేయకుండా సాహసం చేయరా ఢింబకా అంటున్నారు నిర్వాహకులు. మరి చూడాలిక.. ఈ సారి సీజన్ ఎలా ఉండబోతుందో..?
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







