జీతాలు ఎగవేసిన గల్ఫ్ కంపెనీల నుండి బకాయిలు రాబట్టుకోవడం ఎలా?

- June 05, 2021 , by Maagulf
జీతాలు ఎగవేసిన గల్ఫ్ కంపెనీల నుండి బకాయిలు రాబట్టుకోవడం ఎలా?

తెలంగాణ: 'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలి) అనే నినాదంతో... జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జగదేవుపేటలో శనివారం నాడు గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి హక్కుల గురించి అవగాహన, చైతన్య కార్యక్రమం జరిగింది. 

ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, మాటేటి స్వామిగ్రామ సర్పంచ్ గాగిరెడ్డి లింగమ్మ - రాజేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, జైపాల్ రెడ్డి, పలువురు గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు. దుబాయి నుండి వాపస్ వచ్చిన లోక ఆదిరెడ్డి తనకు జీతం బకాయిలు ఇప్పించాలని కోరారు.  

కరోనా సందర్బంగా గల్ఫ్ తదితర దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన  జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు)  రాబట్టుకోవడానికి బాధితులు తమ వివరాలను ప్రవాసి మిత్ర హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబర్ +91 62817 63686 కు పంపించాలని యూనియన్ నాయకులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com