అన్ లాక్ బాటలో మహారాష్ట్ర..
- June 05, 2021
ముంబై: రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపులు ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. సోమవారం నుంచి ఐదంచెల అన్‌లాక్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పాజిటివిటీ రేటు, రాష్ట్రంలో ఆక్సిజన్ పడకల లభ్యత ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాల్లో మినహాయింపు పరిమితులను నిర్ణయించారు. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి గురువారం కరోనా పరిస్థితులను ప్రజారోగ్య శాఖ సమీక్షించనుంది. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, అన్‌లాక్ మొదటి స్థాయిలో కనీస పరిమితులు ఉండగా, ఐదవ స్థాయిలో అధిక పరిమితులతో అన్ లాక్ ప్రక్రియను ఆచరిస్తారు.
ఆయా జిల్లాలో ఐదు శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో, లేదా 25 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ పడకలు ఉన్న ప్రాంతాల్లో మొదటి స్థాయి పరిమితులు విధిస్తారు. నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు, మాల్స్, థియేటర్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతినిస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకుంటాయి. వివాహాలు, అంత్యక్రియలకు అనుమతులుంటాయి. లోకల్ రైళ్లు కూడా నడుస్తాయి.
ఇక, రెండు, మూడు, నాలుగు స్థాయిల్లో పాజిటివిటీ రేటు ఆధారంగా సడలింపులు నిర్ణయించారు. ఐదవ స్థాయిలో పరిస్థితి ఇంచుమించు లాక్‌డౌన్ మాదిరిగానే ఉంటుంది. నిత్యావసర దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. రెస్టారెంట్లకు ఫుడ్ డెలివరీ చేసే అవకాశాన్ని కల్పించనున్నారు. మాల్స్, షాపింగ్ సెంటర్లు, జిమ్‌లు మూసివేసే వుంచుతారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







