బుర్కినా ఫాసోలో 114 మంది కాల్చివేత
- June 06, 2021
నైమే: బుర్కినా ఫాసో ఉత్తర ప్రాంతంలోని ఒక గ్రామంలో జిహాదీలు ఘాతుకానికి పాల్పడ్డారు. గ్రామస్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో సుమారు 114 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 2015 అనంతరం దేశంలో జరిగిన ఘోరమైన దాడి ఇదేనని తెలిపింది. సహేల్ ప్రాంతం యాఘా ప్రావిన్స్‌లోని సోల్హాన్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఔస్సేని టాంబౌరా తెలిపారు. ఈ కాల్పులకు జిహదీలే కారణమని అన్నారు. దాడిలో మార్కెట్ సహా పలు ఇళ్లు దగ్ధమయ్యాయాని అన్నారు. క్షతగాత్రులు సెబ్బా పట్టణంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రాంతాన్ని సుమారు 5,000 మంది ఫ్రాన్స్ సైనికులు నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పటికీ.. ఈ దాడి జరగడం గమనార్హం.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







