బుర్కినా ఫాసోలో 114 మంది కాల్చివేత

- June 06, 2021 , by Maagulf
బుర్కినా ఫాసోలో 114 మంది కాల్చివేత

నైమే: బుర్కినా ఫాసో ఉత్తర ప్రాంతంలోని ఒక గ్రామంలో జిహాదీలు ఘాతుకానికి పాల్పడ్డారు. గ్రామస్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో సుమారు 114 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 2015 అనంతరం దేశంలో జరిగిన ఘోరమైన దాడి ఇదేనని తెలిపింది. సహేల్‌ ప్రాంతం యాఘా ప్రావిన్స్‌లోని సోల్హాన్‌ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఔస్సేని టాంబౌరా తెలిపారు. ఈ కాల్పులకు జిహదీలే కారణమని అన్నారు. దాడిలో మార్కెట్‌ సహా పలు ఇళ్లు దగ్ధమయ్యాయాని అన్నారు. క్షతగాత్రులు సెబ్బా పట్టణంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రాంతాన్ని సుమారు 5,000 మంది ఫ్రాన్స్‌ సైనికులు నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పటికీ.. ఈ దాడి జరగడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com