వ్యాక్సిన్ వచ్చిన పది రోజుల్లోనే అందరికీ రెండో డోస్
- June 07, 2021
కువైట్ సిటీ: రెండో డోస్ వ్యాక్సినేషన్ కోసం ఎదురుచూస్తున్నవారిని ఉద్దేశించి హెల్త్ మినిస్టర్ ఓ కీలక ప్రకటన చేశారు. వ్యాక్సిన్లు వచ్చిన 10 రోజుల్లోనే రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నవారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరుగుతుందని హెల్త్ మినిస్టర్ షేక్ డాక్టర్ బాసిల్ అల్ సబా చెప్పారు. 30 కేంద్రాల్లో ఈ మేరకు వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారాయన. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రావడంలో ఆలస్యం వల్లే సమస్య ఏర్పడిందనీ, కువైట్ సహా చాలా దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని ఆయన వివరించారు. మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లను కువైట్ త్వరలో దిగుమతి చేసుకోనుందని మినిస్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







