యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కి తప్పిన ప్రమాదం..
- June 07, 2021
అమెరికా: యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఎక్కిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ల్యాండ్ అయింది. విమానం వాషింగ్టన్ శివార్లలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద సాంకేతిక లోపం గుర్తించి వెంటనే ల్యాండ్ చేశారు. దీంతో కమలా హారిస్‌కి అతి పెద్ద ప్రమాదం తప్పింది. కమల తన మొదటి అంతర్జాతీయ పర్యటన కోసం గ్వాటెమాలాకు వెళ్లేటప్పుడు సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన వెంటనే ల్యాండ్ అవ్వవలసి వచ్చింది. ఫ్లైట్ దిగి కిందికి వస్తూ "నేను బాగున్నాను, నేను బాగున్నాను" అని హారిస్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. మరో విమానంలో ఉపాధ్యక్షురాలు ఆదివారం సాయంత్రం ఆమె గ్వాటెమాలకు సురక్షితంగా చేరుకుందని పూల్ రిపోర్ట్ తెలిపింది. ఆమె ప్రయాణంలో పెద్ద జాప్యం జరగలేదని ఆమె ప్రతినిధి సిమోన్ సాండర్స్ తెలిపారు. ఈ వారం హారిస్ గ్వాటెమాల మరియు మెక్సికోలను సందర్శిస్తారు. కోవిడ్ -19 ప్రభావంతో దెబ్బతిన్న ఆ ప్రాంతాలను సందర్శిస్తున్నారు హారిస్. ఆ ప్రాంతాల నుంచి ప్రజలు వలసలు వెళుతున్నారు. వలసలకు మూల కారణాలను పరిష్కరించే దిశగా అధ్యక్షుడు జో బిడెన్ డిప్యూటీగా హారిస్ తన మొదటి పర్యటనను చేపట్టారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







