చిక్కుడు ఆవకాయ

- June 02, 2015 , by Maagulf
చిక్కుడు ఆవకాయ

 

 

కావలసిన పదార్ధాలు:

  • చిక్కుడుకాయలు        - 6 కప్పులు
  • ఆవపిండి                   - 2 టీ స్పూన్లు
  • మెంతి పొడి                - 1 టీ స్పూను
  • నూనె                        - 1 కప్పు
  • కారం                        - 2 టీ స్పూన్లు
  • ఉప్పు                       - తగినంత
  • చింతపండు గుజ్జు         - 3 టీ స్పూన్లు
  • కరివేపాకు                  - 4 రెబ్బలు
  • ఆవాలు                    - 1 టీ స్పూను
  • ఎండుమిర్చి               - 4
  • పసుపు                     – చిటికెడు

 

చేయు విధానం:

  • చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి పది నిమిషాలు ఎండలో ఆరనివ్వాలి.
  • పాన్ లో 2 టీ స్పూన్ల నూనె వేసి చిక్కుడుకాయ ముక్కల్ని వేయించాలి.
  • ఇప్పుడు చింతపండు గుజ్జు వేసి మరికాసేపు వేయించాలి.
  • ఈ మిశ్రమం చల్లారాక కారం, ఉప్పు, ఆవపిండి, పసుపు, మెంతి పొడి వేసి కలపాలి.
  • మిగిలిన నూనెను పాన్ లో వేసి ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు చేసి పచ్చడిలో కలిపితే చిక్కుడు ఆవకాయ తయార్.
  • ఇది పదిహేను రోజులు నిల్వ ఉంటుంది.

 

------ వై.పార్వతి, హైదరాబాద్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com