మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం.. 15 మంది సజీవ దహనం
- June 07, 2021
ముంబై: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆ రాష్ట్రంలోని పూణెలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దూరదృష్టవశాత్తు 15 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో ఆ కెమికల్ ఫ్యాక్టరీలో 37 మంది కార్మికులు ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ ఘటన సమాచారం తెలియగానే.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటల నుంచి 20 మందిని కాపాడింది. మరో ఇద్దరు కార్మికులు మంటల్లోనే చిక్కుకోవడం బాధకరమైన విషయం. ప్రస్తుతం మంటలు ఆర్పే పనిలో ఫైర్ సిబ్బంది ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంతో సహా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియ రాలేదు.
తాజా వార్తలు
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!









