వెజిటబుల్ లడ్డు
- March 06, 2016
కావలసిన పదార్థాలు : క్యారెట్ తురుము-1 కప్పు, బీట్రూట్ తురుము-1 కప్పు, కొబ్బరి తురుము-1 కప్పు, బొంబాయి రవ్వ-1 కప్పు, పంచదార-3 కప్పులు, నెయ్యి-3 కప్పులు, బాదం జీడిపప్పు ముక్కలు-ఒక కప్పు, యాలకుల పొడి-ఒక టీస్పూన్.
తయారుచేసే విధానం : స్టవ్‌పై మందపాటి గిన్నె ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి బొంబాయి రవ్వను దోరగా వేయించి ఒక ప్లేటులో ఉంచుకోవాలి. గిన్నెలో మరికాస్త నెయ్యి వేసి కొబ్బరి, క్యారెట్, బీట్రూట్ తురుము వేసి సన్నటి మంటపై అయిదు నిమిషాలు వేగించాలి. తర్వాత పంచదార వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. గడ్డ కట్టకుండా గరిటెతో మధ్య మధ్యన తిప్పాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చల్లారాక అర చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని లడ్డూలు చేసుకోవాలి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









