విదేశీయుల వర్క్ పర్మిట్స్ సంఖ్యలో గణనీయమైన తగ్గుదల

- June 08, 2021 , by Maagulf
విదేశీయుల వర్క్ పర్మిట్స్ సంఖ్యలో గణనీయమైన తగ్గుదల

బహ్రెయిన్: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా విదేశీ వర్కర్లకు జారీ అయిన కొత్త వర్క్ పర్మిట్ల సంఖ్య గత ఏడాదితో పోల్చితే గణనీయంగా తగ్గింది. తాజా గణాంకాల ప్రకారం గత ఏడాది 535,000 మంది వర్క్ పర్మిట్లు పొందగా, అంతకు ముందు ఏడాది 592,000 పర్మిట్లు పొందారు. అంటే, గత ఏడాది తగ్గుదల 9.7 శాతం. గత ఏడాది చివరి త్రైమాసికంలో 152,678 మంది బహ్రెయినీలకు ఉద్యోగాలు లభించాయి. 2019లో ఈ సంఖ్య 153,853గా వుంది. బహ్రెయినీ పౌరుల యావరేజ్ సేలరీ గత ఏడాది చివరి త్రైమాసికంలో 545కి చేరింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 3.2 శాతం అదనం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com