తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు

- June 08, 2021 , by Maagulf
తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు

హైదరారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పొడిగించింది.ఈ మేరకు మంగళవారం జరిగిన సుదీర్ఘ కేబినెట్‌ భేటీ తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.  ​కాగా, లాక్‌డౌన్‌ మరింత సడలింపులు ఇస్తూ కూడా నిర్ణయం తీసుకుంది.  రేపట్నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ను ప్రభుత్వం సడలించింది. అదే సమయంలో ప్రజలకు ఒక గంట వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది.కేబినెట్ భేటీ‌లో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయించారు. ప్రగతి భవన్‌లో సుధీర్ఘంగా భేటీ అయిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లాక్‌డౌన్ యథావిధిగా కొనసాగనుంది. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజక వర్గాల పరిధిలో లాక్ డౌన్ యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వానాకాలం పంటలు, సాగునీటి అంశాల‌పైనా ఈ సమావేశంలో చర్చించారు. దీంతో పాటు పలు ఇతర అంశాలు కూడా కేబినెట్ మంత్రులు చర్చించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com