విదేశీ ఉద్యోగులకు,సెలవుపై వచ్చిన వారికి ప్రాధాన్యతతో కోవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వండి
- June 08, 2021
హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే వారికి, విదేశాల నుండి సెలవుపై వచ్చిన వారికి ప్రాధాన్యతతో కోవిడ్19 వ్యాక్సిన్లు ఇవ్వాలని భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు పొందిన తెలంగాణ రాష్ట్రంలోని రిక్రూటింగ్ ఏజెన్సీల సంఘం 'ఓవర్సీస్ మ్యాన్‌పవర్ రిక్రూటర్స్ అసోసియేషన్' (ఓమ్రా) అధ్యక్షులు డి ఎస్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంగళవారం ఒక లేఖ రాశారు.లేఖ ప్రతిని మంత్రి కేటీఆర్, హైదరాబాద్ లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఇ) ముకేశ్ కౌశిక్ లకు కూడా పంపారు.
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చిన విధంగానే వీరికి కూడా వ్యాక్సిన్లు వేయాలని, టీకా సర్టిఫికెట్‌లో పాస్‌పోర్ట్ నంబర్‌ను చేర్చాలని కోరారు. కేరళలో వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో పాస్‌పోర్ట్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తున్నారని అన్నారు.
విదేశాలకు కొత్తగా ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే ఆశావహులు, విదేశాల నుండి సెలవుపై వచ్చిన లక్షలాది మంది భారతీయ పౌరులు కోవిడ్19 పరిమితుల కారణంగా ప్రయాణించలేని పరిస్థితిలో ఉన్నారు.వ్యాక్సిన్లు తీసుకున్న ప్రయాణికుల ప్రవేశాన్ని గల్ఫ్ దేశాలు అనుమతిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతించిన 'కోవిషీల్డ్' వాక్సిన్ భారత్ లో అందుబాటులో ఉందని డి.ఎస్ రెడ్డి అన్నారు.
విదేశీ ఉద్యోగార్ధులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ లభ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇది వలస కార్మికులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుందని, ఎటువంటి సమస్యలు లేకుండా విధుల్లో చేరడానికి, వారి ఆర్థిక సమస్యల నుండి బయటకు రావడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.సకాలంలో ప్రయాణించకుంటే పొరుగు దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశమున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశీ ఉద్యోగాల కల్పనలో తాము ప్రముఖ పాత్ర పోషిస్తూ, నిరుద్యోగ సమస్యను తీరుస్తున్నామని అన్నారు.మేము పంపిన కార్మికులు ప్రతి ఏటా 80 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఇంటికి పంపించడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభంగా ఉన్నారని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్‌లైన్‌లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







