రెసిడెన్సీ పర్మిట్, వీసా గడువు జులై 31 వరకు పొడిగింపు

- June 09, 2021 , by Maagulf
రెసిడెన్సీ పర్మిట్, వీసా గడువు జులై 31 వరకు పొడిగింపు

సౌదీ: ప్రవాసీయుల ఇఖామా(రెసిడెన్సీ పర్మిట్), ఎగ్జిట్, రీ ఎంట్రీ వీసాల గడువును జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ట్రావెల్ బ్యాన్ కారణంగా పలు దేశాల్లో ప్రవాసీయులు చిక్కుకుపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. విజిట్ వీసాల గడువును కూడా పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో రెన్యూవల్ చేసుకోకుండానే ప్రవాసీయుల రెసిడెన్సీ పర్మిట్ తో పాటు ఎగ్జిట్, రీ ఏంట్రీ, విజిట్ వీసాలు ఆటోమెటిగ్గా జులై 31 వరకు చెల్లుబాటులో ఉంటాయి. దీనికోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సౌజన్యంతో ఇటీవలి కాలంలో గడువు ముగిసిన వీసాలు, రెసిడెన్సీ అనుమతులు అటోమెటిగ్గా అప్ డేట్ చేస్తున్నట్లు పాస్ పోర్ట్స్ డైరెక్టరేట్ జనరల్ అధికారులు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com