రెసిడెన్సీ పర్మిట్, వీసా గడువు జులై 31 వరకు పొడిగింపు
- June 09, 2021
సౌదీ: ప్రవాసీయుల ఇఖామా(రెసిడెన్సీ పర్మిట్), ఎగ్జిట్, రీ ఎంట్రీ వీసాల గడువును జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ట్రావెల్ బ్యాన్ కారణంగా పలు దేశాల్లో ప్రవాసీయులు చిక్కుకుపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. విజిట్ వీసాల గడువును కూడా పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో రెన్యూవల్ చేసుకోకుండానే ప్రవాసీయుల రెసిడెన్సీ పర్మిట్ తో పాటు ఎగ్జిట్, రీ ఏంట్రీ, విజిట్ వీసాలు ఆటోమెటిగ్గా జులై 31 వరకు చెల్లుబాటులో ఉంటాయి. దీనికోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సౌజన్యంతో ఇటీవలి కాలంలో గడువు ముగిసిన వీసాలు, రెసిడెన్సీ అనుమతులు అటోమెటిగ్గా అప్ డేట్ చేస్తున్నట్లు పాస్ పోర్ట్స్ డైరెక్టరేట్ జనరల్ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







