అస్ట్రాజెన్కా రెండో డోస్ కోసం 3,30,000 మంది ఎదురుచూపులు

- June 09, 2021 , by Maagulf
అస్ట్రాజెన్కా రెండో డోస్ కోసం 3,30,000 మంది ఎదురుచూపులు

కువైట్ సిటీ: ఆస్ట్రాజెన్కా సరఫరాలో జాప్యంతో కువైట్లో ఇంకా 3,30,000 మందికి వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు తప్పటం లేదు. తొలి డోస్ గా ఆస్ట్రాజెన్కా వ్యాక్సిన్ వేసుకున్న లబ్ధిదారులంతా ఇప్పుడు సెకండ్ డోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే..ముందస్తు ఒప్పందం ప్రకారం మే 31 నాటికే వ్యాక్సిన్ కువైట్ కు చేరుకోవాలి. కానీ, వ్యాక్సిన్ బ్యాచ్ నాణ్యత పరీక్షల ఫలితాలు ఆలస్యం కావటంతో తదుపరి బ్యాచ్ ఒప్పందం మేరకు సరఫరా చేయలేకపోతున్నామంటూ కంపెనీ వర్గాలు కువైట్ ఆరోగ్యశాఖకు సమాచారం అందించాయి. లబ్ధిదారుల ఆరోగ్య భద్రత తమకు ముఖ్యమని అందుకే నాణ్యత విషయంలో తగిన ప్రమాణాలు పాటిస్తున్నట్లు వెల్లడించాయి. జూన్ 8 నాటికి టెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. అయితే..తొలి డోస్ వేసుకొని రెండో డోస్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కువైట్ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రెండో డోస్ ఆలస్యంతో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండబోవని తెలిపింది. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com