దుబాయ్ లో 10 కొత్త స్కూల్స్..2021-22 అకాడమిక్ ఇయర్లో ప్రారంభం

- June 09, 2021 , by Maagulf
దుబాయ్ లో 10 కొత్త స్కూల్స్..2021-22 అకాడమిక్ ఇయర్లో ప్రారంభం

దుబాయ్: దుబాయ్ లో మరో 10 కొత్త స్కూల్స్ ను ప్రారంభం కానున్నాయి.  2021-22 విద్యా సంత్సరం నుంచే కొత్త స్కూల్స్ ను ఓపెన్ చేయనున్నట్లు నాలెడ్జ్ & హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకటించింది. దీంతో దుబాయ్ విద్యా వ్యవస్థలో అదనంగా 14,671 సీట్లు విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి. తిలాల్ అల్ ఘఫ్, అల్ వార్కా, అల్ కరామా, అల్ బర్షా, సిటీ వాక్, మిర్దిఫ్, నాడ్ అల్ షెబా, అల్ ఖవనీజ్, రషీదియాలకు కొత్త స్కూల్స్ మంజూరు చేసినట్లు అధికారులు వివరించారు. కొత్త స్కూల్స్ ద్వారా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్, ఐబీ బోధనాంశాలను ఆఫర్ చేయనున్నట్లు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com