కేసీఆర్ కేబినెట్ కీలక నిర్ణయం..హరీష్ రావుకు వైద్యారోగ్య శాఖ కీలక బాధ్యత...
- June 09, 2021
హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపధ్యంలో కేసీఆర్ సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీనిపై నిన్న జరిగిన క్యాబినెట్ లో చర్చ జరిగింది.
ఈ ఆరోగ్య సబ్ కమిటీకి ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షునిగా వ్యవహరించనున్నారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పి. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ సభ్యులు దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నటువంటి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేయనున్నారు. అలాగా ఉత్తమమైన ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్లి అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ ఆదేశించింది.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరో థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన మౌలిక వసతులను సిబ్బందిని ఔషదాలను సమకూర్చుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
మరోవైపు రేషన్ డీలర్ల కమీషన్, ఇతర సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నియమించారు కేసీఆర్. ఈ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని, సబిత, ఇంద్రకరణ్ రెడ్డిలు సభ్యులుగా వుంటారు.
అలాగే దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్‌కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 4,46,169 మంది అర్హులకు రేషన్ కార్డులను అధికారులు జారీ చేయనున్నారు. ఈ మేరకు 15 రోజుల్లో రేషన్ కార్డులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వర్షాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయశాఖ సంసిద్ధతపైనా కేబినెట్ చర్చించింది. రాష్ట్రంలో కాళేశ్వరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై మంత్రిమండలి హర్షం వ్యక్తం చేసింది. గతేడాది కోటికిపైగా ఎకరాల్లో మూడుకోట్ల టన్నుల వరి దిగుబడి రావడంపై సంతోషం వ్యక్తం చేసింది. సాకుగు కృషి చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అధికారులు, సిబ్బందిని కేబినెట్ అభినందించింది. అలాగే రానున్న వర్షాకాలం సాగు కోసం రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







