ప్రయాణీకుల కోవిడ్ 19 టెస్టుల్లో అవకతవకలు: ప్రైవేట్ లేబరేటరీ మూసివేత

- June 09, 2021 , by Maagulf
ప్రయాణీకుల కోవిడ్ 19 టెస్టుల్లో అవకతవకలు: ప్రైవేట్ లేబరేటరీ మూసివేత

సౌదీ అరేబియా: రియాద్ హెల్త్ డిపార్టుమెంట్, ఓ ప్రైవేటు లేబరేటరీని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 స్క్రీనింగ్ విషయమై ఈ లేబరేటరీ అవకతవకలకు పాల్పడినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కోవిడ్ 19 శాంపిల్స్ ట్రాక్ చేయడం జరిగిందనీ, వాటిల్లో కొన్నింటిని రాండమ్ పద్ధతిలో పరిశీలించగా, పలు ఉల్లంఘనలు వెలుగు చూశాయనీ తెలుస్తోంది. కొన్ని నెగెటివ్ ఫలితాల్లోనూ లోపాలు వున్నట్లు మినిస్ట్రీ గుర్తించింది. భారీ స్థాయిలో పరికరాలు వుండడంతో పెద్దయెత్తున శాంపిల్స్ సేకరించేందుకు అనుమతులు పొందిన ఆ లేబరేటరీ, పలు అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించారు. జరీమానాలు విధించడంతోపాటు, లైసెన్స్ రద్దు చేయడం అలాగే రెండేళ్ళపాటు ఈ లేబరేటీరిపై నిషేధం విధించడం.. ఇలా పలు చర్యలు తీసుకున్నారు. మెడికల్ లేబరేటరీలు తప్పనిసరిగా కరోనా నిబంధనలకు లోబడి పనిచేయాలనీ, ఎలాంటి అవకతవకలకూ అవకాశం ఇవ్వరాదని మినిస్ట్రీ హెచ్చరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com