మరో మూడు దేశాల నుంచి ప్రయాణీకులపై నిషేధం విధించిన యూఏఈ
- June 09, 2021
యూఏఈ: జాంబియా, డిఆర్ కాంగో మరియు ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపైన కూడా తాత్కాలిక నిషేధం విధించింది యూఈఏ. జూన్ 11 శుక్రవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. అయితే, కొన్ని గ్రూపులకు మాత్రం మినహాయింపు వుంటుంది. యూఏఈ పౌరులు అలాగే వారి ఫస్ట్ డిగ్రీ బంధువులు అలాగే డిప్లమాటిక్ మిషన్ మీద వచ్చేవారికి ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తారు. అధికారిక డెలిగేషన్స్, వ్యాపరవేత్తలు, గోల్డెన్ మరియు సిల్వర్ రెసిడెన్సీ కలిగినవారు, ఎసెన్షియల్ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా మినహాయింపు పొందుతారు. కాగా, పీసీఆర్ టెస్టింగ్ పీరియడ్ (ప్రయాణానికి ముందు) 72 గంటల నుంచి 48 గంటలకు కుదించారు. మినహాయింపు పొందిన గ్రూపులకు చెందినవారు తప్పనిసరిగా కరోనా నిబంధనలు, క్వారంటైన్ నిబంధనలు పాటించాలి. 10 రోజుల క్వారంటైన్, ఎయిర్‌పోర్టులో పీసీఆర్ టెస్టు (4 మరియు 8వ రోజు.. దేశంలోకి ప్రవేశించిన తర్వాత) చేయించుకోవాలి. ఇండియా, యూఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం తదితర దేశాల నుంచి విమానాల్ని ఇటీవలే యూఏఈ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







