యూఏఈ: దుబాయ్ ఆర్టీయేలో ఉద్యోగావకాశాలు

- June 09, 2021 , by Maagulf
యూఏఈ: దుబాయ్ ఆర్టీయేలో ఉద్యోగావకాశాలు

దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్టీయే), వాక్ ఇన్ ఇంటర్వ్యూలను ట్యాక్సీ డ్రైవర్ల నియామకం కోసం జూన్ 11 శుక్రవారం నుండి నిర్వహించనుంది. ఐదు రోజులపాటు ఈ ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ భవనంలో జూన్ 11 నుంచి జూన్ 15 వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. అమ్మాన్ స్ట్రీట్, ముహైస్నాహ్‌లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఫుల్ టైమ్  ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఐదేళ్ళ అనుభవం తప్పనిసరి. ఆసక్తి వున్న అభ్యర్థులు తమ బయోడేటాను [email protected] అడ్రసుకు ఇ-మెయిల్ చేయడం లేదా +971565151791 నంబరకు వాట్సాప్ చేయవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com