ఏపీ కరోనా అప్డేట్

- June 09, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 8766 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,79,773 కు చేరింది.ఇందులో 16,64,082 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,03,995 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 67 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 11,696 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 12,292 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 93,511 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com