సమ్మర్ వర్క్ బ్యాన్ ఉల్లంఘిస్తే ఒక్కో కార్మికుడిపై KD200 ఫైన్

- June 10, 2021 , by Maagulf
సమ్మర్ వర్క్ బ్యాన్ ఉల్లంఘిస్తే ఒక్కో కార్మికుడిపై KD200 ఫైన్

కువైట్: పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో సమ్మర్ వర్క్ బ్యాన్ను పకడ్బందీగా అమలు చేసే దిశగా కువైట్ చర్యలు తీసుకుంటోంది. కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా వేసవి పగటి సమయాల్లో బహిరంగ ప్రాంతాల్లో పనులు చేయించటాన్ని నిషేధించిన విషయాన్ని తెలిసిందే.  ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ నేరుగా తాకే ప్రాంతాల్లో కార్మికులతో పనులు చేయించకూడదు. ఎవరైనా యజమానులు ఈ నిబంధనలను ఉల్లంఘించి పగటి వేళల్లో బహిరంగ ప్రాంతాల్లో పనులు పురమాయిస్తే...కార్మిక చట్టంలోని ఆర్టికల్ 141 మేరకు శిక్షార్హులు అవుతారని మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉల్లంఘనులకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే ఒక్కో కార్మికుడిపై కనిష్టంగా  KD100 నుంచి గరిష్టంగా KD200 వరకు జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. ఆ జరిమానా మొత్తాన్ని యాజమాన్యమే భరించాల్సి ఉంటుంది. కార్మిక చట్టాల్లోని నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు తమ బృందాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయని తెలిపింది. ఒకవేళ యాజమాన్యాలు పగటి వేళల్లో కార్మికులను ఎండ తగిలే ప్రాంతాల్లో పనులకు పురమాయించినట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని సూచించింది. జహ్రా - రాజధాని ప్రాంతంలో 66646466, హవాలీ - ఫర్వానియా 66205229, ముబారక్ అల్-కబీర్ -99990930, అహ్మది - 66080612 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com