ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కాంబినేషన్ లో సినిమా

- June 02, 2015 , by Maagulf
ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కాంబినేషన్ లో సినిమా

నందమూరి ఫ్యామిలీలో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కనుందనే వార్త గత కొన్నాళ్ళనుంచి తెగ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కాంబినేషన్ ఓ మల్టీస్టారర్‌కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ కథారచయిత వక్కంతం వంశీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారనున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మించనున్నారని అంటున్నారు. వక్కంతం వంశీ చెప్పిన పవర్‌ఫుల్ కథ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఇద్దరికీ నచ్చిందని, వారిద్దరూ వెంటనే సినిమాను ఓకేచేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు వక్కంతం వంశీ తాజాగా టెంపర్ లాంటి సూపర్‌హిట్ సినిమాను అందించిన విషయం తెలిసిందే! కళ్యాణ్‌రామ్ నిర్మాణంలో తెరకెక్కిన కిక్-2 ఈనెలలోనే విడుదలవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com