కోవాగ్జిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అమెరికా నిరాకరణ

- June 11, 2021 , by Maagulf
కోవాగ్జిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అమెరికా నిరాకరణ

న్యూఢిల్లీ: కోవాగ్జిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (FDA) అనుమ‌తి నిరాక‌రించింది.వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా చెబుతూ అనుమతులను నిరాకరించింది.కోవాగ్జిన్ తయారీకి అమెరికా భాగస్వామి అయిన ఆక్యుజెన్ ఫార్మా..అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసింది.అయితే, ఇప్పుడు ఎఫ్ డీఏ అనుమతులను తిరిస్కరించడంతో ఇక దానికి దరఖాస్తు చేయబోమని, అన్నీ పూర్తయ్యాక బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ ను పెట్టుకుంటామని ప్రకటించింది.
 
ఎఫ్డీఏ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని చెప్పింది. కోవాగ్జిన్ ను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసేందుకు మరింత సమాచారం కావాల్సి ఉంటుందని పేర్కొంది.ఈ నిర్ణయంతో కోవాగ్జిన్ అమెరికాలో అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని ఆక్యుజెన్ సీఈవో డాక్టర్ శంకర్ ముసునూరి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com