మైనారిటీల అభివృద్దికి విశేష కృషి:ఇంతియాజ్ అహ్మద్
- June 11, 2021
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో మైనారిటీల అభివృద్దికి కృషి చేస్తానని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్ అన్నారు.ఇటీవలి వరకు కృష్ణా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్ ప్రభుత్వ పరిపాలనాపరమైన బదిలీలలో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు.శుక్రవారం సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టి ఆశాఖ ఉన్నతాధికారులతో ప్రాధమికంగా సమావేశం అయ్యారు.శాఖకు సంబంధించిన విభిన్న అంశాలను అధికారులు ప్రత్యేక కార్యదర్శికి వివరించారు.ఈ సందర్భంగా ఇంతియజ్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధన్యతల మేరకు అధికారులు అంకిత భావంతో పనిచేయాలన్నారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుందని,అవి క్షేత్ర స్దాయికి చేరేలా అధికారులు శ్రద్ద వహించాలని సూచించారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇంతియాజ్ ను ముస్లిం మత పెద్దలు సన్మానించారు.మైనారీలు ఎదుర్కుంటున్న పలు అంశాలను ప్రత్యేక కార్యదర్శి దృష్టికి తీసుకురాగా,సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







