నేచురల్లీ.. బ్రేక్‌ఫాస్ట్ విత్ కాన్సుల్ జనరల్ నాలుగో ఎడిషన్

- June 11, 2021 , by Maagulf
నేచురల్లీ.. బ్రేక్‌ఫాస్ట్ విత్ కాన్సుల్ జనరల్ నాలుగో ఎడిషన్

యూఏఈ: నాలుగో ఎడిషన్ బ్రేక్‌ఫాస్ట్ విత్ కాన్సుల్ జనరల్ కార్యక్రమం శుక్రవారం రస్ అల్ ఖైమాలో జరిగింది. భారత వర్క్‌ఫోర్స్‌తో ఈ సమావేశాన్ని దుబాయ్ కాన్సుల్ జనరల్ కార్యాలయం నిర్వహించింది. కాన్సుల్ (లేబర్) తాడు మాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేచురల్లీ ఎల్‌ఎల్‌సి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ అమన్ పూరి మాట్లాడుతూ, వర్క్‌ఫోర్స్ మెరుగైన స్కిల్స్ నేర్చుకోవాలనీ, తద్వారా మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కాన్సులేట్ ఈ మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్ని ఇండియన్ కమ్యూనిటీ వినియోగించుకోవాలని సూచించారు. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్ర ద్వారా రోజులో ఇరవై నాలుగ్గంటలూ ఇండియన్ కమ్యూనిటీకి సేవలందించేందుకు ప్రయత్నిస్తామని ఆయన వివరించారు. స్వయంగా ఈ కేంద్రాలని సందర్శించవచ్చు. వాట్సాప్ ఇ-మెయిల్ మొబైల్ యాప్ అలాగే టోల్ ఫ్రీ (80046342) నెంబరుని సంప్రదించవచ్చు. ఆయుర్వేద ప్రోడక్టులను మార్కెటింగ్ చేయడంలో నేచురల్లీ సంస్థ మార్కెట్ లీడర్‌గా వుందని ఈ సందర్భంగా కాన్సుల్ పేర్కొన్నారు. షాంపూ ప్రొడక్షన్‌కి సంబంధించి రోబోటిక్ మెషీన్‌ను కాన్సులర్ ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం త్వరలో జరగనున్న నేపథ్యంలో యోగా సెషన్ కూడా నిర్వహించారిక్కడ. బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలనూ నిర్వహించడం జరిగింది. నేచురల్లీ ప్రాంగణంలో కొన్ని మొక్కల్ని కాన్సుల్ జనరల్ నాటడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com