వాహనదారులకు శుభవార్త..
- June 11, 2021
న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది.డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన రూల్స్ సవరించింది.కొత్త రూల్స్ వల్ల చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది.మరీ ముఖ్యంగా లెర్నర్స్ లైసెన్స్ పొందటానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే లెర్నింగ్ లైసెన్స్ పొందొచ్చు.
కొత్త రూల్స్ జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తర్వాత వాహనదారులు లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే లెర్నింగ్ లైసెన్స్ పొందొచ్చు.కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌కు అనుగుణంగా సారథి సాఫ్ట్‌వేర్‌లో కూడా మార్పులు చేస్తోంది.
మీరు ఆన్లైన్లో లెర్నింగ్ లైసెన్స్ పొందటానికి రాష్ట్ర ప్రభుత్వపు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. లేదంటే పరివాహన్ లేదా సారథి వెబ్సైట్లలోకి వెళ్లాలి. అక్కడి నుంచి లెర్నింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
ఆన్లైన్ టెస్ట్ కూడా మీరు మీ ఇంట్లో నుంచే పూర్తి చేయొచ్చు.ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లక్కర్లేదు. టెస్ట్‌లో పాస్ అయిన వారు లెర్నింగ్ లైసెన్స్ పొందొచ్చు.తొలిగా ఈ సేవలు ఉత్తరప్రదేశ్‌లో అందుబాటులోకి రానున్నాయి.తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







