'సినారె'కు అక్షర సుమాంజలి
- June 11, 2021
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,పద్మభూషణ్,మాజీ రాజ్యసభ సభ్యులు మహాకవి డా.సి.నారాయణరెడ్డి నాలుగు సంవత్సరాల క్రితం (2017) నిర్యాణం చెందారు.ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్,హైదరాబాద్,డా.సి.నారాయణరెడ్డి వంశీ విజ్ఞాన పీఠం,కేతవరపు ఫౌండేషన్,సంతోషం ఫిల్మ్ న్యూస్ సంయుక్తంగా జూన్ 12 సాయంత్రం 5 గంటలకు అంతర్జాలంలో ట్రైనెట్ లైవ్ టీవీ,సంతోషం లైవ్ ద్వారా 'సినారె' కు అక్షర సుమాంజలి సమర్పించనున్నారు.'సినారె' కృతులపై వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధన చేసిన విద్వాంసుల ప్రసంగాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ అపూర్వ నివాళి కార్యక్రమంలో పరిశోధనలు చేసిన డాక్టర్ ఎం.కె.రాము,డా.వి.ఎల్ నరసింహారావు,డా.నల్లా ప్రభావతి దేవి,
డా.నందినేని రవీందర్,ప్రసంగించబోతున్నారు.ఈ కార్యక్రమంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, భువనచంద్ర,డా.జుర్రుచెన్నయ్య,కళాబ్రహ్మ శిరోమణి డా.వంశీ రామరాజు, సురేష్ కొండేటి
డా.కేతవరపు రాజ్యశ్రీ పాల్గొంటారు.ఈ వర్చ్యువల్ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







