పద్మ పురస్కారాలకు నామినేషన్ల చివరి తేదీ సెప్టెంబర్ 15…
- June 11, 2021
న్యూ ఢిల్లీ: ఆయా రంగాల్లో విశేషమైన సేవలందించన వారికి భారత ప్రభుత్వం పద్మ అవార్డులు అందిస్తోందన్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ అవార్డులను అందిస్తుంది.కళలు, సాహిత్యం, విద్య, ఆటలు, వైద్యం,సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ వంటి రంగాలలో విశిష్టమైన,అసాధారణమైన విజయాలు / సేవలకు ఈ అవార్డును ఇస్తారు.ఈ క్రమంలోనే 2022 పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.మీకు తెలిసిన గొప్ప వ్యక్తులను పద్మ అవార్డులకు సిఫార్సు చేయాలని కేంద్రం ప్రకటించింది.ఈ క్రమంలోనే నామినేషన్ల స్వీకరణకు 2021 సెప్టెంబర్ 15ను చివరి తేదీగా నిర్ణయిస్తూ.. కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. పద్మ అవార్డుల నామినేషన్లు, సిఫార్సులు ఆన్‌లైన్‌లో పద్మ అవార్డుల పోర్టల్ https://padmaawards.gov.in లో స్వీకరిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







