మతం కంటే మానవత్వం గొప్పది: నారా భువనేశ్వరి
- June 11, 2021
హైదరాబాద్: కరోనా విపత్తు సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ విశిష్టమైన సేవలు అందిస్తోందని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. శుక్రవారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సమయంలో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నిపుణులైన వైద్యులతో ఆన్‌లైన్‌లో వైద్యసేవలు అందించడం జరుగుతోందన్నారు. ఇప్పటివరకు 782 మందికి పైగా సేవలు అందించగా, 480 మంది పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా ప్రజలకు అందించడం జరుగుతోందన్నారు.
హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారికి టెలీమెడిసిన్ ద్వారా వైద్య సహాయం, అవసరమైన వారికి మందులు అందించడంతో పాటు తాజాగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. మతం కంటే.. మానవత్వం ముఖ్యమన్న నినాదంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. 24/7 కాల్ సెంటర్ అందుబాటులోకి తెచ్చి. అవసరమైన వారికి ఇళ్లవద్దకే మందులు పంపిణీ చేస్తున్నామని..
ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండరాదన్న లక్ష్యంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు 78వేల మందికి ఆహారం అందించామని వివరించారు. అవసరమైతే మరింతగా అన్నదాన కార్యక్రమాలు చేపడతామని, ఆపన్నులకు అండగా నిలుస్తామన్నారు. కుటుంబసభ్యులు ముందుకురాని, అనాధ శవాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవావిభాగం ఆధ్వర్యంలో వారివారి ఆచారాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతం చేసి.. పేదలకు తామున్నామనే భరోసా కల్పిస్తామని, మానవ సేవే మాధవ సేవ అనే నినాదం స్పూర్తిగా ముందుకు సాగుతున్నామని భువనేశ్వరి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







