కోవిడ్‌ సెకండ్ వేవ్..ఇప్ప‌టి వ‌ర‌కు 719 మంది వైద్యులు మృతి

- June 12, 2021 , by Maagulf
కోవిడ్‌ సెకండ్ వేవ్..ఇప్ప‌టి వ‌ర‌కు 719 మంది వైద్యులు మృతి

న్యూఢిల్లీ : కోవిడ్‌ సెకండ్ వేవ్ ఉప్పెనను తలపించింది.కుటుంబాలను తుడిచిపెట్టింది. బాంధవ్యాలను చిన్నాభిన్నం చేసింది. ప్రాణాలు పోసే డాక్టర్లను సైతం విడిచిపెట్టలేదు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ సెకండ్‌ వేవ్‌లో మొత్తంగా 719 మంది వైద్యులు కోవిడ్‌కు బలయ్యారు. అత్యధికంగా బీహార్‌లో 111 మంది వైద్యులు మరణించగా..ఢిల్లీలో 109 మంది, ఉత్తరప్రదేశ్‌లో 79 మంది, బెంగాల్‌లో 63 మంది, రాజస్తాన్‌ 43 మంది ప్రాణదాతలను కరోనా మింగేసింది. కాగా, తక్కువగా పుదుచ్చేరిలో ఒకరు, గోవా, ఉతరాఖండ్‌, త్రిపురల్లో ఇద్దరు చొప్పున, పంజాబ్‌లో ముగ్గురు వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, బీహార్‌లోనే ఎక్కువ మంది వైద్యులు చనిపోవడం వెనుక కారణాలను అన్వేషించాలని ఎనిమిది సభ్యులతో కూడిన కమిటీని ఐఎంఎ రాష్ట్ర బ్రాంచ్‌ ఏర్పాటు చేసింది.ఈ కమిటీకి డా.షాజనాధ్‌ ప్రసాద్‌ సింగ్‌ నేతృత్వం వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com