అమెరికాలో కోవాగ్జిన్ కు క్లినికల్ ట్రయల్స్
- June 12, 2021
అమెరికా: భారత్ బయోటెక్ అమెరికాలోనూ తన వ్యాక్సిన్ ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.కోవాగ్జిన్ కు అనుమతి కోరుతూ అమెరికా ప్రభుత్వానికి భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తుకు మద్దతుగా కోవాగ్జిన్ కు అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని భారత్ బయోటెక్ నిర్ణయించుకుంది. కోవాగ్జిన్ మార్కెటింగ్ అనుమతుల దరఖాస్తు ఆధారంగా అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది.డేటా జనరేషన్, సమాచార పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
భారత్ లో కోవాగ్జిన్ పరిశోధనాత్మక అధ్యయనంపై సమాచారం పంచుకున్నామని పేర్కొంది. 1,2,3 దశల క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని ఇప్పటికే అందజేశామని తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ వివరాలను నియంత్రణ సంస్థలు పరిశీలించాయని భారత్ బయోటెక్ వివరించింది. టీకా భద్రత, సమర్థతపై 9 పరిశోధనాత్మక అధ్యయనాలు జరిపినట్టు వెల్లడించింది.భారత్ లో క్లినికల్ ట్రయల్స్ డేటా పంచుకున్న వ్యాక్సిన్ తమదొక్కటేనని స్పష్టం చేసింది. భారతీయులపై వ్యాక్సిన్ సమర్థత వివరాలు పంచుకున్న తొలి సంస్థ తమదేనని పేర్కొంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







