నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: సీపీ మహేశ్ భగవత్
- June 12, 2021
హైదరాబాద్: రైతులకు నకిలీ విత్తనాలు ఎవరు అమ్మినా వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.రాచకొండ సీపీ మహేశ్ భగవత్.నకిలీ విత్తనాలను నిల్వ ఉంచిన గోదాములపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.హయత్‌నగర్,వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాల షాపులపై దాడులు నిర్వహించినట్లు సీపీ తెలిపారు. హయత్‌నగర్‌లోని పసుమాములలో రూ.60 లక్షల విలువైన నకిలీ విత్తనాలను సీజ్ చేశామని చెప్పారు.పత్తి, మిర్చి, వేరుశెనగ విత్తనాల గడువు ముగిసినప్పటికీ, మళ్లీ ప్యాక్‌చేసి వాటిని అమ్ముతున్నారని చెప్పారు.అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నారని చెప్పారు సీపీ మహేశ్ భగవత్. నకిలీల విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై గత నాలుగేళ్లలో 10 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదుచేశామన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







