దుబాయ్: ఫార్మసీ దోపిడి కేసులో ముగ్గురికి జైలుశిక్ష
- June 12, 2021
దుబాయ్: ఓ ఫార్మసీలో దోపిడికి పాల్పడిన ముగ్గురు సభ్యుల ఆసియా గ్యాంగ్ కు జైలు శిక్ష పడింది. నేరం నిర్ధారణ కావటంతో ముగ్గురికి ఏడాది జైలుశిక్ష, Dhs4,000 జరిమానాతో పాటు శిక్షా కాలం ముగిసిన తర్వాత వారిపై దేశబహిష్కరణ అమలు చేయాలని దుబాయ్ కోర్టు తీర్పు వెలువరించింది. గతేడాది మార్చిలో దుబాయ్ లోని రిక్కి ప్రాంతంలో దోషులు దోపిడికి పాల్పడ్డారు. తాను ఫార్మసీలో విధులు నిర్వహిస్తుండగా ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు మొదటి షాపులోకి వచ్చి మందులు కొన్నారని బాధితుడు కోర్టుకు తెలిపాడు. తాను మందులు ఇచ్చి డబ్బులు క్యాష్ బాక్స్ డ్రాలో వేస్తున్న సమయంలో ఇద్దరిలో ఓ వ్యక్తి కత్తితో తనను బెదిరించాడని, మరో వ్యక్తి తనపై కారం చల్లాడని, అంతలోనే మూడో వ్యక్తి కూడా ఫార్మసీలోకి దూసుకొచ్చి దోపిడి పాల్పడ్డాడని వివరించాడు. తాను ఎదురు తిరిగినా, తన భుజంపై కత్తితో దాడి చేసి క్యాష్ బాక్స్ డ్రాలో నుంచి Dhs4,000 డబ్బు దోచుకెళ్లినట్లు కోర్టుకు తెలిపాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..దర్యాప్తు చేసిన పోలీసులు ఆసియా గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావటంతో దుబాయ్ కోర్టు దోషులకు శిక్షలు ఖరారు చేసింది.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







