ఈ నెల 18న వైద్యుల దేశవ్యాప్త నిరసన: ఐఎంఏ
- June 12, 2021
ప్రాణదాతల రక్షణ బాధ్యత కేంద్రానిదేనన్న భారత వైద్యమండలి
న్యూ ఢిల్లీ: బిహార్, పశ్చిమ బెంగాల్, అసోం, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా ‘సేవ్ ది సేవియర్’ నినాదంతో ఆరోగ్య సిబ్బంది ఈ నెల 18న ఆందోళన చేపట్టనున్నట్టు ఐఎంఏ వెల్లడించింది. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది నల్లటి వస్త్రాలు, మాస్కులు, బ్యాడ్జీలను ధరించి నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించింది. అయితే ఆ రోజు ఆసుపత్రులు పని చేస్తాయని తెలిపింది. వైద్యులు సహా ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న దాడుల నియంత్రణకు కఠిన చట్టాలను రూపొందించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎంఏ అధ్యక్షుడు జేఏ జయలాల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రాణదాతలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్ వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులపై జరిగిన అమానుష దాడుల గురించి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా రెండో దశ వ్యాప్తిలో వైరస్ సోకి దేశవ్యాప్తంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్టు ఐఎంఏ వెల్లడించింది. బిహార్‌లోనే ఎక్కువ మంది మృతి చెందినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







