చైనా: గ్యాస్ పేలుడు ఘటనలో 11 మంది మృతి
- June 13, 2021
బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.సెంట్రల్ చైనాలోని హుబేయి ప్రావిన్స్‌లో భారీ గ్యాస్ పేలుడు సంభవించడంతో 11 మంది మరణించగా...37మంది తీవ్రగా గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటన ఆదివారం ఉదయం 6.30 షియాన్ సిటీలోని జంగ్వాన్ జిల్లాలో జరిగింది. స్థానిక మార్కెట్‌పై ఈ పేలుడు తీవ్ర ప్రభావాన్ని చూపిందని సిజిటిఎన్-టివి పేర్కొంది. అనేక మంది నివాసితులు అల్పాహారం చేసేందుకు, కూరగాయలకు మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు తరచూ ఇక్కడకు వస్తారని పేర్కొంది.ఈ పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని భావించి అధికారులు సహాయక చర్యలు చేపట్టారని పేర్కొంది. మొత్తంగా మృతులతో సహా 144 మందిని వెలికి తీశారని సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







