నిరుద్యోగులకు శుభవార్త
- June 13, 2021
హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలోనే 20 వేల పోలీసు పోస్టులను భర్త చేయనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు.సంగారెడ్డిలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని నిన్న ప్రారంభించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్టు మహమూద్ అలీ తెలిపారు.వివిధ విభాగాల్లో త్వరలోనే 20 వేల పోలీసు నియామకాలను చేపట్టనున్నట్లు చెప్పారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వివిధ విభాగాలలో ఇప్పటివరకు 80 వేల మందికి పైగా రిక్రూట్ చేసినట్లు చెప్పారు. మహిళా ప్రాధాన్యతలో భాగంగా నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు. మహిళలకు రక్షణ నిమిత్తం షీ టీమ్స్ ఏర్పాటును చేశామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ పోలీసు శాఖ కీలక పాత్ర పోషించిందన్నారు. గత సంవత్సర కాలంగా లాక్‌డౌన్ సమయాల్లో పోలీసుల త్యాగాలను హోంమంత్రి ప్రశంసించారు. పోలీసుశాఖకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మహమూద్ అలీ తెలిపారు.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







