కోవిడ్ తో మరణించిన వారి అస్థికలను పవిత్ర నదుల్లో కలిపే 'అస్థి విసర్జన్' సేవ!

- June 13, 2021 , by Maagulf
కోవిడ్ తో మరణించిన వారి అస్థికలను పవిత్ర నదుల్లో కలిపే \'అస్థి విసర్జన్\' సేవ!

హైదరాబాద్: కరోనా మహమ్మారికి ఎందరో జీవితాలు తారుమారు అయ్యాయి. సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సంతో ఎందరో తమ ఆత్మీయులను కోల్పోయారు. కడసారి చూపు కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ప్రజలు తమ ఆత్మీయులకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు జరిపే ఆస్కారం లేక ఎంతో అల్లాడిపోయారు..ఇప్పుడు 'అస్థి విసర్జన్' అనే కార్యక్రమంతో ప్రజలకు ఊరటనిచ్చే ఆలోచన చేసింది భారత పోస్టల్ డిపార్ట్మెంట్.

పోస్టల్ డిపార్ట్మెంట్ 'అస్థి విసర్జన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించిన కొద్ది రోజులకే, తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఈ సేవను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను ప్రారంభించింది. 

ప్రయోజనం: కోవిడ్-19 బారినపడి మరణించినవారి అస్థికలను వారణాసి, హరిద్వార్, ప్రయాగ్-రాజ్ లేదా గయాలో కలిపేందుకు అవకాశం. ఈ మొత్తం ఆచారాలను (శ్రాద్ధ) కుటుంబ సభ్యులు చూసేందుకు కూడా వీలు కల్పిస్తుంది.

ఈ సేవకు బుకింగ్‌ల కోసం తెలంగాణ పోస్టల్ విభాగం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ కార్యాలయాలను షార్ట్ లిస్టింగ్ చేస్తోందని అధికారులు తెలిపారు. "ఈ ప్రత్యేకమైన సదుపాయాన్ని ప్రారంభించడానికి తపాలా శాఖ అధికారులు పద్ధతులను రూపొందిస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి నడుమ కఠిన ప్రయాణ నిబంధనలు ఉన్నందున ప్రయాణించలేని ప్రజలు, తమ బంధువుల అస్థికలను హరిద్వార్, ప్రయాగ్రాజ్, వారణాసి, గయా మొదలైన ప్రదేశాల్లో కలిపేందుకు ఈ సేవ ఊరటగా ఉంటుంది ”అని తెలంగాణ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎస్ రాజేంద్ర కుమార్ అన్నారు. 

పోస్టుల డిపార్ట్మెంట్ లోని మెయిల్ బిజినెస్ విభాగం మరియు సామాజిక-మత వేదిక అయిన, ఓం దివ్య దర్శన్ (ODD) తో కలిసి ఈ సేవను అందిస్తోంది. ఈ సేవలో భాగంగా అస్తికల నిమర్జనం తదుపరి ‘గంగా జల్’ పంపిణీ చేసే బాధ్యత కూడా చేస్తుంది. శ్రాద్ధ కార్యక్రమం మొత్తం ‘లైవ్ వెబ్‌కాస్ట్’ ను కూడా అందిస్తుంది. అస్థికలను నిమర్జనానికి మృతుల బంధువులు బుక్ చేసుకోవలసి ఉండగా, గంగా జలం పంపే ఖర్చును ఒడిడి భరిస్తుందని రాజేంద్ర కుమార్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com