నిహారిక మూవీ ఏప్రిల్ 8న రిలీజ్...
- March 07, 2016
తొలి సారి మెగా ఫ్యామిలీ నుండి నిహారిక వెండి తెరకు హీరోయిన్గా పరిచయం అవుతుండగా, ఈ మెగా భామ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే బుల్లి తెరపై సందడి చేసిన నిహారిక తాజాగా ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నిహారిక ప్రస్తుతం ఒక మనసు అనే చిత్రంలో నటిస్తుండగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ను విడుదల చేసారు.'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' చిత్రానికి దర్శకత్వం వహించిన రామ రాజు , నిహారిక చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఇందులో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. మధుర శ్రీధర్, ఓ ప్రముఖ ఛానెల్ సంయుక్తంగా ఒక మనసు చిత్రాన్ని నిర్మించనుండగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.తాజాగా విడుదలైన ఒక మనసు ప్రీ లుక్ మెగా ఫ్యాన్స్‌ని ఫుల్ ఎైగ్జెట్‌మెంట్‌కు గురి చేస్తుండగా, ఈ చిత్ర రిలీజ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







