ఆన్ లైన్ లో 3 రకాల డ్రైవింగ్ లైసెన్సింగ్ సేవలు
- June 14, 2021
దుబాయ్: ఆర్టీఏ సేవలను ఒక్కోటిగా ఆన్ లైన్ చేస్తూ వస్తున్న దుబాయ్ ఆర్టీఏ..ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్సింగ్ కు సంబంధించి మూడు రకాల సేవలను ఆన్ లైన్ పరిధిలోకి తీసుకొచ్చింది.డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్,పోయిన,డ్యామేజ్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ ల స్థానంలో కొత్త లైసెన్స్ జారీ, డ్రైవర్లకు ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ల జారీ సేవలను ఇకపై పూర్తి ఆన్ లైన్ చేస్తున్నట్లు ప్రకటించింది.మిడ్ జూన్ ఈ మూడు సేవలు కేవలం ఆన్ లైన్ కే పరిమితం కానున్నాయి.లైసెన్స్ రెన్యూవల్, రిప్లేస్మెంట్,డ్రైవర్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ కోసం దుబాయ్ ఆర్టీఏ యాప్ లేదా ఆర్టీఏ వెబ్ సైట్ http://www.rta.ae ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఆర్టీఏ ఆన్ లైన్ సేవల వల్ల రెండు రోజులు పట్టే పనులు కేవలం 15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. అంతేకాదు నాలుగుసార్లు ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండేది.కానీ, ఇప్పుడు అంతా ఆన్ లైన్లోనే పూర్తి చేయవచ్చు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







