కువైట్ లో నమోదైన ఇండియన్ స్ట్రెయిన్..అప్రమత్తమైన యంత్రాంగం
- June 14, 2021
కువైట్: భారత్ ను కుదిపేసిన 'డెల్టా వేరియంట్' కు ప్రపంచం భయపడుతోంది. కారణం, అత్యంత ప్రబలంగా, వేగంగా ఈ వేరియంట్ సోకటమే. ఇప్పుడు ఈ వేరియంట్ నెమ్మదిగా ఇతర దేశాలకు వ్యాప్తి చెంది సుమారు 62 దేశాలలో నమోదయింది.
తాజాగా, పెద్ద సంఖ్యలో డెల్టా వేరియంట్ కువైట్ లో నమోదయింది అని కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ తెలిపారు.
వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రపంచ రాష్ట్రాలతో కలిసి వ్యాప్తి చెందుతున్న వేరియంట్ల నమూనాలను అధ్యయనం చేయడమే కాకుండా క్రమం తప్పకుండా వైరస్ జన్యు పరీక్షలను కువైట్ ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది అని డాక్టర్ అబ్దుల్లా అన్నారు.
ప్రబలంగా మారుతున్న ఈ కరోనా వారియంట్లను ఎదుర్కోవటానికి ప్రజలు మరింత శ్రద్ధగా జాగ్రత్తలు తీసుకోవాలని అబ్దుల్లా హెచ్చరించారు. వ్యాక్సిన్లను తీసుకోవడం, మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, చేతులను కడుక్కోవటం/శానిటైస్ చేసుకోవటం, సామూహిక సమావేశాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు విధిగా ఆచరించాలి అని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







