Callforblood ఫౌండేషన్ మొబైల్ యాప్ ప్రారంభించిన సీపీ వీసీ సజ్జనార్
- June 14, 2021
హైదరాబాద్: వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే సందర్బంగా ఈరోజు Callforblood Foundation మొబైల్ యాప్ ని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా సైబరాబాద్ సజ్జనార్ మాట్లాడుతూ... రక్తదాతను పొందాలంటే ఎంత కష్టం అవుతుందో వివరించారు.ప్రజలందరూ కూడా ఈ Callforblood మొబైల్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని డోనర్ గా రిజిస్టర్ అవ్వాలని కోరారు.

ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత సైన్స్ పెరిగినా రక్తదానం చేయడానికి ఎలిజిబుల్ ఉన్న దాతలు కూడా వెనుకంజ వేస్తున్నారు.ఈ పాండమిక్ సమయంలో తలసేమియా పేషెంట్స్ కి, కాన్సర్ పేషెంట్స్ కి, గర్భిణీలకి రక్తం దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు.
గత సంవత్సర కాలంలో సైబరాబాద్ పోలీస్ వారి ఆధ్వర్యంలో కండక్ట్ చేసిన స్పెషల్ డ్రైవ్‌లో దాదాపు 12,000 మంది రక్తదానం చేసారు.వ్యాక్సిన్ వేసుకున్న 14 రోజులకు తర్వాత ఎలిజిబుల్ ఉన్న వారు రక్తదానం చేయవచ్చు.ఇమ్మ్యూనిటి తగ్గుతుందని అపోహలకు పోవద్దు అని సూచించారు.
ఈ సంవత్సరంలో దాదాపు 4 సార్లు స్వయంగా రక్తదానం చేశానని సజ్జనార్ గారు తెలిపారు.ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, ప్రజలందరికి ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన Callforblood Foundation వ్యవస్థాపకుడు చింతల సంపత్ ని, మొబైల్ యాప్ ని డిజైన్ చేసిన Metis టెక్నాలజీ (Maven group) డైరెక్టర్ C.భవాని శంకర్ ను,సంస్థలో ఉన్న సభ్యులందరిని సజ్జనార్ అభినందించారు.
సంస్థ వ్యవస్థాపకుడు చింతల సంపత్ మాట్లాడుతూ... రక్తదాతలను ఆరెంజ్ చేసే ప్రయత్నంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము.డోనర్స్ కొంతమంది సమయానికి స్పందించకపోవడము,అందుబాటులో ఉండకపోవడం,ఆరోగ్యం సహకరించక పోవడం లాంటివి జరుగుతున్నాయి.
డోనర్స్ ని సమకూర్చే ప్రయత్నంలో స్నేహితులకు, బందువులకు ఫోన్ చేసి వారిని కూడా ఈ ప్రయత్నంలో భాగస్వాములను చేయడం వళ్ళ వారి సమయం కూడా కేటాయించేవారు. ఇలా మాకు చాలా వరకు సమయం వృధా అయ్యేది.ఇప్పటికీ ఇలా సమయం వృధా కాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ CALLFORBLOOD FOUNDATION...
Callforblood ఫౌండేషన్ App అనేది One Stop Solution for all the Blood requests అనే ఉద్దేశ్యంతో ఈ మొబైల్ అప్లికేషన్ ని డిజైన్ చేయడం జరిగింది.ఈ అప్లికేషన్ వలన పేషెంట్ కి 30 నిముషాలలో రక్తదాతను సమాకుర్చడం జరుగుతుంది.రక్తదాతల వివరాలు కూడా చాలా గొప్యంగా ఉంచడానికి అదునాతన టెక్నాలజీ కలిగిన సాఫ్ట్వేర్ ని వాడడం జరిగింది.రక్తదాతలు రక్తదానం చేసిన తర్వాత వచ్చే 3 నెలలు hide అవడం,4వ నెల నుండి తిరిగి ఆక్టివ్ లోకి వచ్చే విధంగా ఈ యాప్ ని డిజైన్ చేసారు.ఇంకా ఇలాంటి ఎన్నో అత్యాధునిక టెక్నాలజీతో మొబైల్ యాప్ ని డిజైన్ చెయడం జరిగింది.
ఇప్పటి వరకు దాదాపు 800 మందికి పైగా రక్తదానం,సెకండ్ వేవ్ లో 50కి పైగా ప్లాస్మా దానం చేపించడం జరిగింది.ఈ క్రమంలో మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చింతల సంపత్ తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







