రోడ్ల పై కార్లను వదిలేస్తే Dh3,000 ఫైన్, కారు సీజ్

- June 15, 2021 , by Maagulf
రోడ్ల పై కార్లను వదిలేస్తే Dh3,000 ఫైన్, కారు సీజ్

అబుధాబి: రోడ్ల పక్కన, కూడళ్ల దగ్గర చాలా కాలంగా నిలిపిన కార్లను వెంటనే తొలగించాలని అబుధాబి అధికారులు వాహనదారులను హెచ్చరించారు. రోడ్ల పక్కన, కూడళ్ల దగ్గర వాహనాలను పార్క్ చేసి వదిలేస్తే కారును సీజ్ చేయటంతో పాటు వెహికిల్ ఓనర్ కు Dh3,000 జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కొందరు వాహనదారులు తమ వాహనాలను పబ్లిక్ ప్రాంతాల్లో పార్క్ చేసి చాలాకాలం పాటు వాటిని పట్టించుకోకుండా వదిలేయటంతో అవి దుమ్ముపట్టి నగర సౌదర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. క్లీన్ సిటీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ముసాఫా ఇండస్ట్రియల్ ఏరియా, మాఫ్రాక్, బనియాస్, అల్ వాత్బా ప్రాంతాల్లో వందల కొద్ది కార్లను నిర్లక్ష్యంగా వదిలేసినట్లు గుర్తించిన అధికారులు..వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com