లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజేఐ
- June 15, 2021
తెలంగాణ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఎన్‌వీ రమణ సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఎన్‌వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఎన్‌వీ రమణ ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆలయ సందర్శనకు రావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎన్‌వీ రమణ పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







